Wednesday, 11 October 2023

హైదరాబాద్ మార్కెట్ లోకి ఉదయకృష్ణ నెయ్యి

 హైదరాబాద్: సృష్టిలో అమ్మ తరువాత అంత గొప్పది గోమాతయే నని,అన్ని పోషక పదార్థాల తయారీకి మూలం కూడా గోమాతనేనని ఆవు నెయ్యి అందుకు గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని ఉదయకృష్ణ ఆవు నెయ్యి సౌత్ ఇండియా హెడ్ రాంచందర్ రావు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ప్రతినిధులు షర్మిల, దివకర్, విష్ణు లతో కలిసి ఆ సంస్థ నూతనంగా ఉత్పత్తి చేసిన ఉదయకృష్ణ నెయ్యిని ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1990 లో ఇద్దరు సోదరుల కృషి వల్ల ప్రారంభం అయిన ఉదయకృష్ణ తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ప్రాచుర్యం పొంది నేడు తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభం చేస్తున్నామన్నారు.శుద్ధమైన, పరిపూర్ణమైన నెయ్యిని అందుబాటులోకి తేవాలన్న సత్సంకల్పంతో ఉదయకృష్ణ నెయ్యిని ప్రారంభించారని, ఏ వంటకానికి అయిన ఈ నెయ్యి తోడైతే ఆ రుచిని ప్రజలందరు గొప్పగా ఆస్వాదిస్తారన్నారు.దివకర్ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ఉదయ కృష్ణ నెయ్యి ఇప్పటికే మంచి ప్రాచుర్యంలోకి వచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో ఉదయకృష్ణ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment