Sunday, 30 June 2024

ఓనస్ ఆస్పత్రిలో స‌రికొత్త విభాగం ప్రారంభం

 చంపాపేట‌లో అత్యాధునిక కార్డియాల‌జీ ఆస్ప‌త్రి
* ఓనస్ ఆస్పత్రిలో స‌రికొత్త విభాగం ప్రారంభం
* ప్రారంభించిన తెలంగాణ ప్ర‌ణాళికా మండ‌లి వైస్ ఛైర్మ‌న్ చిన్నారెడ్డి
* కార్య‌క్ర‌మంలో ప‌లువురు ఎమ్మెల్యేలు, కార్పొరేట‌ర్లు, ఇత‌ర నాయ‌కులు

హైదరాబాద్, జూన్ 30, 2024: నగరంలోని చంపాపేట ప్రాంత వాసులకు అత్యున్న‌త స్థాయి గుండె వైద్య చికిత్సలు అందించేందుకు ఓనస్ రోబోటిక్, కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో కొత్తగా అత్యాధునిక కార్డియాలజీ విభాగాన్ని ఆదివారం ప్రారంభించారు.  తెలంగాణ ప్ర‌ణాళికా మండ‌లి వైస్ ఛైర్మ‌న్ చిన్నారెడ్డి చేతుల మీదుగా ఈ విభాగం ప్రారంభ‌మైంది. కార్య‌క్ర‌మంలో ఇంకా తెలంగాణ ప‌ర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీ ఎన్‌.ప్ర‌కాష్ రెడ్డి ఐపీఎస్‌, యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫ‌ర్ హుస్సేన్ మెరాజ్‌, మ‌ల‌క్‌పేట ఎమ్మెల్యే అహ్మ‌ద్ బ‌లాల, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్ట‌ర్ వంశీకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గౌర‌వ అతిథులుగా ఐఎస్ స‌ద‌న్ కార్పొరేట‌ర్ శ్వేతా మ‌ధుక‌ర్ రెడ్డి, ఐఎస్ స‌ద‌న్ మాజీ కార్పొరేట‌ర్ స్వ‌ప్నా సుంద‌ర్ రెడ్డి, చంపాపేట కార్పొరేట‌ర్, బీజేపీ ఎల్బీన‌గ‌ర్ క‌న్వీన‌ర్ వంగా మ‌ధుసూద‌న్ రెడ్డి, గాయ‌త్రిన‌గ‌ర్ కార్పొరేట‌ర్ స‌బితా రాజ‌శేఖ‌ర్ రెడ్డి, లింగోజిగూడ కార్పొరేట‌ర్ ద‌రిప‌ల్లి రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆస్ప‌త్రి వ్య‌వ‌స్థాప‌కుడు, ఎండీ డాక్ట‌ర్ బాల‌రాజు నాయుడు  మాట్లాడుతూ, ‘‘ఈ విభాగంలో అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉంది. అత్యంత నైపుణ్యం కలిగిన కార్డియాలజిస్టులు, నర్సులు, టెక్నీషియన్ల బృందంతో ఇక్కడ అత్యుత్తమ స్థాయి చికిత్సలను రోగులకు అందిస్తారు. ఇక్క‌డ అత్యాధునిక క్యాథ్ ల్యాబ్, ఇమేజింగ్ పరికరాలు, ప్రత్యేకమైన కార్డియాక్ సర్జరీ సూట్లు తదితరాలు ఉన్నాయి. రోజువారీ పరీక్షలతో పాటు నాన్ ఇన్వేజివ్ చికిత్సలు, సంక్లిష్టమైన గుండె శస్త్ర చికిత్సలు, ఇంటర్వెన్షనల్ ప్రాసీజర్లు అన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇప్ప‌టివ‌ర‌కు ఈ ఆస్ప‌త్రిలో 6,500కు పైగా శస్త్రచికిత్సలు చేసి, 1.35 ల‌క్ష‌ల మంది రోగులకు చికిత్సలు అందించాము’’ అని ఆయ‌న చెప్పారు.  

కార్య‌క్ర‌మంలో కార్డియాలజీ విభాగాధిపతి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ లక్కిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘మా అత్యాధునిక సాంకేతికత, అనుభవం కలిగిన బృందంతో.. రోగులకు అత్యంత అనుకూలమైన వాతావరణంలో వారికి గుండె రక్తనాళాలకు సంబంధించిన సమస్యలనూ పరిష్కరించగలరు. మేము రోగ నివారణ, చికిత్సల దగ్గ నుంచి అత్యంత సమస్యాత్మకమైన గుండెసమస్యల కేసుల వరకు అన్నింటికీ చికిత్సలు చేయగలము’’ అని తెలిపారు.

ఆస్ప‌త్రిలో ఇంకా ఎలక్ట్రో ఫిజియాలజీ సేవలు, కార్డియాక్ రీహాబిలిటేషన్, 24/7 ఎమర్జెన్సీ చికిత్సలు సైతం అందుబాటులో ఉన్నాయి. 2018లో 30 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిగా ప్రారంభ‌మై, 2019లో దేశంలోనే తొలిసారిగా ఓనస్ హాస్పిటల్ ఆన్ వీల్స్ ప్రారంభించారు. 2020లో 30 పడకల నుంచి 50 పడకలకు విస్త‌రించి, ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ సేవలనూ అందుబాటులోకి తెచ్చారు.


 

No comments:

Post a Comment